Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ కి బహూకరించిన పారిజాత వృక్షం గుర్తుంది కదండీ! ఆ వృక్షం భూలోకంలో ఇప్పుడు ఎక్కడుందో తెలుసా! ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలో లో కింటూర్ గ్రామంలో ఉంది . ఈ వృక్షాన్ని ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు.
ఇది పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షాన్ని ఒక ప్రత్యేక జాతికి చెందిన వృక్షంగా అభివర్ణించారు. ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. ఈ చెట్టు పై భాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. దిగువ భాగంలో ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగు కలిసిన ఒక ప్రత్యేక రంగులో చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి.
ఈ పరి జాతి పుష్పం చాలా అరుదుగా కనిపిస్తుంది జూన్ లేదా జులై నెలల్లో మాత్రమే వికసిస్తుంది ఈ పుష్పం ఎంతో ఆహ్లాదకరంగా ఉండి చాలా దూరం వరకు సువాసన వ్యాపిస్తుంది ఈ వృక్షం యొక్క వయసు సుమారు వెయ్యి నుంచి ఐదు వేల సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఈ వృక్షం ఎత్తు 45 అడుగులు కాండం చుట్టుకొలత 50 అడుగులు గా ఉంటుంది ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం ఏంటంటే దీని ఆకులు గాని శాఖలు కానీ అనేది జరగదు
విన్నారు కదా! మీకు తెలిసి ఇంత గొప్ప వృక్షం భూలోకంలో ఎక్కడైనా కనిపించిందా? అంటే లేదనే చెప్పాలి. అందుకే పారిజాత వృక్షాన్ని ఓ ప్రత్యక వృక్షంగా నిర్వచించారు సైంటిస్టులు.
Author: Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 1
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.